రీ ఎంట్రీకి రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రీ ఎంట్రీకి రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్

Meera Jasmine  Re entry
  • 'అమ్మాయి బాగుంది'తో ఫస్టు ఎంట్రీ
  • మలయాళ సినిమాతో రీ ఎంట్రీ
  • తెలుగు సినిమాల పట్ల ఆసక్తి    
నిన్నటి తరం అందాల కథానాయికలుగా ఒక వెలుగు వెలిగినవారు, మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అక్క .. వదిన .. అమ్మ పాత్రలలో బిజీ అవుతున్నారు. అలా రీ ఎంట్రీ ఇచ్చినవారి జాబితాలో తాజాగా 'మీరా జాస్మిన్' చేరిపోయింది. 'అమ్మాయి బాగుంది' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మీరా జాస్మిన్, ఆ తరువాత పవన్ జోడీగా 'గుడుంబా శంకర్' సినిమాలో సందడి చేసింది.

అందం .. అభినయం కలగలిసిన నాయికగా మంచి మార్కులు కొట్టేసింది. బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ సరసన కూడా ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ సినిమాలను ఎక్కువగా చేసిన మీరా జాస్మిన్, వివాహమైన తరువాత సినిమాలకు దూరమైంది.

ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ఒక మలయాళ సినిమాలో గెస్టు రోల్ చేసిన ఆమె, ఇక పూర్తి స్థాయిలో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. ఆ తరువాత ఆమె అంగీకరించిన చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించనున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇక ఆమె తన స్థాయికి తగిన పాత్రలు చేయడానికి సిద్ధమనే సంకేతాలను టాలీవుడ్ కి కూడా పంపుతోందట. స్నేహ .. భూమిక .. మీనా సరసన మీరా జాస్మిన్ కూడా చేరనుందన్న మాట.
Meera Jasmine
Pavan
Jagapathi Babu
Balakrishna
Raviteja

More Telugu News