'దృశ్యం 2'ను పూర్తిచేసిన వెంకీ!
- ఘన విజయాన్ని అందుకున్న 'దృశ్యం'
- ముగింపు దశలో సీక్వెల్ షూటింగ్
- హైలైట్ గా నిలవనున్న అనూప్ సంగీతం
తెలుగు 'దృశ్యం 2' సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతూ వెళుతోంది. 'నారప్ప' తరువాత వెంకటేశ్ పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. తాజాగా ఆయన పోర్షన్ కి సంబంధించిన షూటింగు పూర్తయింది. ఇక వెంకటేశ్ 'ఎఫ్ 3' కోసం పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. 'దృశ్యం 2'లో హీరో నేరం చేశాడని నిరూపించడం కోసం పోలీసులు ఒక ప్లాన్ వేస్తారు. ఆ ట్విస్ట్ కి షాక్ కాని ఆడియన్స్ బహుశా ఉండకపోవచ్చు. అందుకు జీతూ జోసెఫ్ ను మెచ్చుకోని వాళ్లుండరు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది.