మన స్నేహానికి నిర్వచనం ఈ ఫొటో: ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్
- నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు
- తమ స్నేహాన్ని చాటేలా ఉన్న ఫొటో పోస్టు చేసిన ఎన్టీఆర్
- లవ్యూ తారక్ అంటూ రిప్లై ఇచ్చిన చరణ్
- మరోసారి వెల్లడైన ఎన్టీఆర్, చరణ్ ల స్నేహానుబంధం
ఎన్టీఆర్, చరణ్ ల స్నేహం వాళ్లిద్దరీ మధ్యనే కాకుండా వారి కుటుంబాలకు సైతం విస్తరించింది. అనేక కార్యక్రమాలకు వీరు కుటుంబ సభ్యుల సమేతంగా హాజరవడమే అందుకు నిదర్శనం. కాగా, ఇటీవలకాలంలో టాలీవుడ్ హీరోల్లో చాలామంది సొంత ప్రొడక్షన్ సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఓ చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించాలంటూ తారక్ కు చరణ్ సలహా ఇచ్చినట్టు, మిత్రుడి సలహాను పరిశీలించిన తారక్, ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.