ఏపీ సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్నీ రాజీనామా
- ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్నీ
- ఈ నెల 31తో ముగియనున్న నిమ్మగడ్డ పదవీకాలం
- అదే రోజున బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్నీ
- ఇప్పటివరకు సీఎం సలహాదారుగా కొనసాగిన సాహ్నీ
నిమ్మగడ్డ పదవీకాలం మార్చి 31తో ముగియనుండగా, తదనంతరం అదే రోజున ఆమె కొత్త పదవిలోకి వస్తారు. కాగా ఎస్ఈసీగా నియమితురాలైన నీలం సాహ్నీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పదవిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.