తెలంగాణ బడ్జెట్ అంకెలు చూస్తే అబ్బో అనిపించేలా ఉన్నాయి: రఘునందన్ రావు
- బడ్జెట్ అంకెల గారడీ అంటూ విమర్శలు
- అంకెలకు తగ్గట్టుగా ఖర్చు చేయాలని హితవు
- నిధులు ఎక్కడ్నించి తెస్తారో చెప్పాలని డిమాండ్
ఉస్మానియా వర్సిటీకి, ఉస్మానియా ఆసుపత్రికి, క్రీడలకు దేనికి డబ్బుల్లేవు... కానీ బడ్జెట్ మాత్రం అంకెల గారడీని తలపిస్తోంది అని వ్యాఖ్యానించారు. విద్యారంగానికి జాతీయ స్థాయి కంటే తక్కువ నిధులు కేటాయించారని విమర్శించారు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు.