ashish: ఈ ఒక్క‌ విషయంలో పాజిటివ్‌గా ఉండకూడదనుకున్నాను.. సాధ్యం కాలేదు: ఆశిష్

ashish teste corona posotive
షార్ట్స్‌లో చూడండి
త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని, ఆసుప‌త్రిలో చేరుతున్నాన‌ని తెలుపుతూ సినీన‌టుడు ఆశిష్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. తెలుగులో పోకిరి, చిరుత, అతిథి, అదుర్స్ వంటి సినిమాల్లో ఆయ‌న‌ నటించి మంచి పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

త‌న‌కు ఈ మ‌ధ్య‌ కాస్త జ్వరంగా అనిపించడంతో కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నానని ఆయ‌న తెలిపారు. దీంతో త‌న‌కు రిపోర్టులో పాజిటివ్  వ‌చ్చింద‌ని అన్నారు. అన్ని విష‌యాల్లో పాజిటివ్‌గా ఉండే తాను, క‌రోనా విషయంలో మాత్రం పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నానని, కానీ, సాధ్యం కాలేదని తెలిపారు. ఢిల్లీలోని ఓ ఆసుప‌త్రిలో చేరుతున్నాన‌ని, ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు‌ చేయించుకోవాలని కోరుతున్నానని చెప్పారు.

Go Back to Shorts
ashish
Tollywood
Corona Virus

More Telugu News