'ఆట నాది, రూ.కోటి మీది' అంటోన్న జూ.ఎన్టీఆర్‌.. అల‌రిస్తోన్న 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోమో
Add ap7am to your home Screen

'ఆట నాది, రూ.కోటి మీది' అంటోన్న జూ.ఎన్టీఆర్‌.. అల‌రిస్తోన్న 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోమో

NTR Evaru Meelo Koteeswarulu  Coming soon on Gemini TV
  • షోకి హోస్టుగా ఎన్టీఆర్‌
  • రండి గెలుద్దాం అంటూ ఎన్టీఆర్ ఆహ్వానం 
  • కొత్త గెట‌ప్‌లో క‌న‌ప‌డుతోన్న యంగ్ టైగ‌ర్
'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి  'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ అల‌రించారు. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఈ షోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఈమధ్య ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌ల‌ విడుద‌ల చేసిన ఫ‌స్ట్ ప్రోమోలో చైర్‌లో హోస్ట్ స్థానంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కూర్చుని ఉన్నాడు. దాంతో ఇందులో వ్యాఖ్యాత‌గా ఆయ‌నే ఉంటాడ‌న్న విష‌యాన్ని జెమినీ టీవీ స్ప‌ష్టం చేసింది. ఈ రోజు ఈ ప్రోగ్రాం ప్రోమోను విడుద‌ల చేసి, ఎన్టీఆర్‌ను చూపించింది.

ఈ ప్రోగ్రాంలో ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న ప్ర‌త్యేక‌ డైలాగులు అల‌రిస్తున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో అది సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు. ఇందులో ఆయ‌న కొత్త గెట‌ప్‌లో క‌న‌ప‌డుతున్నాడు.
Jr NTR
Tollywood
Evaru Meelo Koteeswarulu

More Telugu News