శివాలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ.. 70 మంది ఆసుపత్రి పాలు
- రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో ఘటన
- బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- ప్రసాదం విషపూరితం కావడం వల్లేనన్న అధికారులు
ఆ ప్రసాదాన్ని తీసుకున్న కాసేపటికే 70 మంది వరకు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అస్పూర్ ముఖ్య వైద్యాధికారి తెలిపారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు తెలిపారు. ప్రసాదం విషపూరితం కావడమే భక్తుల అస్వస్థతకు కారణమని ప్రాథమికంగా నిర్దారించారు.