చిరు గిఫ్ట్.. 'థ్యాంక్యూ మామా' అంటూ ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్ ట్వీట్!

      Chiranjeevi gifts  Uppena hero
  • మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌కు చిరంజీవి గిఫ్ట్
  • ఉప్పెన హిట్ ప‌ట్ల హ‌ర్షం
  • ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన చిరు
తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం విజయం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే ప‌లు సార్లు స్పందించి, హ‌ర్షం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, ఇప్ప‌టికే ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు  రూ.83 వేల విలువ చేసే ఓ ప్రేమికుల బొమ్మను కూడా ఆయన కానుకగా పంపారు.

ఇక తాజాగా హీరో వైష్ణవ్‌ తేజ్ కు చిరు ఓ ఖరీదైన వాచ్ ను గిఫ్టుగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేస్తూ, వైష్ణ‌వ్ తేజ్ 'థ్యాంక్యూ మామా' అని పేర్కొన్నాడు. కాగా, తొలి  సినిమా ద్వారా వైష్ణ‌వ్ కు మంచి హిట్, గుర్తింపు దక్కాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన‌ సంగీతం, గేయ‌ర‌చ‌యిత‌ శ్రీ‌మ‌ణి రాసిన పాట‌లు ప్ల‌స్ పాయింట్ల‌య్యాయి. ఈ సినిమా రూ.100 కోట్ల వ‌సూళ్ల క్ల‌బ్‌లోనూ చేరింది.
Chiranjeevi
uppena
vaishnav tej
Tollywood

More Telugu News