సలార్ దర్శకుడితో అల్లు అర్జున్ చర్చలు... తెలుగులో మరో భారీ ప్రాజెక్టు..?
- కేజీఎఫ్ తో పాన్ ఇండియా దర్శకుడిగా ప్రశాంత్ నీల్
- ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చిత్రం చేస్తున్న ప్రశాంత్
- తాజాగా హైదరాబాదులో బన్నీ కార్యాలయానికి రాక
- బన్నీకి పవర్ ఫుల్ స్టోరీ వినిపించినట్టు సమాచారం
ఈ నేపథ్యంలో, తాజాగా హైదరాబాదులోని బన్నీ ఆఫీసులో ప్రశాంత్ నీల్ దర్శనమివ్వడంతో మరో భారీ ప్రాజెక్టు కోసమేనని ప్రచారం మొదలైంది. ప్రశాంత్ నీల్... తాజాగా బన్నీకి సూటయ్యే ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును వినిపించడానికే వచ్చాడని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. అయితే సలార్ షూటింగ్ వచ్చే ఏడాది వరకు జరిగే అవకాశం ఉండడంతో ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యేందుకు మరికాస్త సమయం పడుతుందని భావిస్తున్నారు.