రవితేజ సినిమాలో 'గాలి సంపత్' నాయిక
- 'గాలి సంపత్' విడుదల కాకుండానే మరో ఆఫర్
- త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ
- ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా లవ్లీ సింగ్
ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరిగా తాజాగా లవ్లీ సింగ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడవచ్చు!