'రెడ్ సెల్యూట్' అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా 'విరాట పర్వం' నుంచి ప్రత్యేక వీడియో!
- వీరుల తల్లులకు వీరు ప్రతిరూపాలు అంటూ వీడియో
- రానా వాయిస్ ఓవర్
- వచ్చేనెల 30న సినిమా విడుదల
సాయి పల్లవి, నందితా దాస్ , ప్రియమణి, ఈశ్వరీరావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ లను ఇందులో చూపించారు. విరాట పర్వం సినిమాలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వచ్చేనెల 30న ఈ దీనిని విడుదల చేయనున్నారు.