Corona Virus: తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

 166 new corona cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొత్త‌గా 166 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 149 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,572కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,970 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1639 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,963 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 830 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.    
 
 
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News