కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించడం విచారకరం: నారా లోకేశ్
- శివరాత్రికి ముస్తాబవుతున్న కోటప్పకొండ
- ప్రభలు కట్టడాన్ని అడ్డుకుంటున్నారన్న లోకేశ్
- ఇది అపచారం అని వెల్లడి
- ప్రభలు పల్లెల నుంచే బయల్దేరతాయని వివరణ
ప్రభలన్నీ పల్లెల నుంచే బయలుదేరతాయని వివరించారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలే కానీ, ప్రభలు కట్టొద్దని ఆదేశించడం ముమ్మాటికీ సంప్రదాయాలను కాలరాయడమేనని విమర్శించారు. ఇది భక్తుల మనోభావాలు, ఆచారాలకు సంబంధించిన విషయం అని లోకేశ్ స్పష్టం చేశారు. ఇటీవల పరమపవిత్రమైన తిరుమల లడ్డూలను ఓటర్లకు పంచారని, అది నిబంధనల ఉల్లంఘన అవుతుంది తప్ప, తరతరాలుగా వస్తున్న ప్రభలు కాదని వివరించారు.