Corona Virus: తెలంగాణ‌లో కొత్త‌గా 146 క‌రోనా కేసులు

Media Bulletin on status of positivMedia Bulletin
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 29,755 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. అదే సమయంలో 118 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,134కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,696 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,613గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,825 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  765 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

          
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News