Corona Virus: తెలంగాణ‌లో కొత్త‌గా 157 మందికి క‌రోనా పాజిటివ్

Media Bulletin on corona virus in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 29,666 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 163 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,95,988కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,578 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,613కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,797 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  729 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

 
   
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News