'నేను కొట్టినట్లు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్లు నటించు' అన్నట్లుంది మీ యవ్వారం: విజ‌యసాయిరెడ్డి ఎద్దేవా
Add ap7am to your home Screen

'నేను కొట్టినట్లు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్లు నటించు' అన్నట్లుంది మీ యవ్వారం: విజ‌యసాయిరెడ్డి ఎద్దేవా

vijaya sai slams chandrababu
  • భళా.. ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు
  • సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు  తీసుకోవాలి
  • అంతేగానీ టీడీపీ  మేనిఫెస్టోను నిమ్మ‌గ‌డ్డ రద్దు  చేయడమేంటీ?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడితో పాటు రాష్ట్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తీరు పట్ల వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ విడుద‌ల చేసిన మేనిఫెస్టోను ఎస్ఈసీ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు! నేను కొట్టినట్లు నటిస్తా-నువ్వు  ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం. సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలిగానీ, టీడీపీ మేనిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News