Kodanda Reddy: అబద్ధాలు ఆడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటే: కోదండరెడ్డి

Kodanda Reddy fires on KCR and KTR
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలాడటం, మోసం చేయడం కేసీఆర్ కుటుంబానికి అలవాటేనని అన్నారు. తాను మంత్రి కాకముందు జనాలు భోజనమే చేయలేదనే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అవివేకంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూములు ఇస్తే... టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుందని చెప్పారు. ఫార్మాసిటీలో కూడా భూములను లాక్కున్నారని దుయ్యబట్టారు.

కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ తమ హయాంలోనే వచ్చిందని కేటీఆర్ చెప్పుకుంటున్నారని... ఆ సంస్థ 1996లో ప్రారంభమైందని.. టీడీపీ, కాంగ్రెస్ హయాంలలో అభివృద్ధి చెందిందని కోదండరెడ్డి చెప్పారు. ఫార్మా సిటీ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రియలెస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ఫార్మా పేరుతో జరుగుతున్న భూకుంభకోణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Kodanda Reddy
Congress
KCR
KTR
TRS

More Telugu News