విజయవాడలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ కు అస్వస్థత
- విజయవాడ జీజీహెచ్ లో వ్యాక్సిన్ తీసుకున్న రాధ అనే హెల్త్ వర్కర్
- కళ్లు తిరిగినట్టుగా, చలిగా అనిపించిన వైనం
- వెంటనే అత్యవసర చికిత్స అందించిన డాక్టర్లు
కోలుకున్న తర్వాత రాధ మాట్లాడుతూ, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కళ్లు తిరిగినట్టు అనిపించిందని, చాలా చలిగా అనిపించిందని చెప్పారు. ప్రస్తుతం కొంత చలిగా ఉన్నా, బాగానే ఉందని తెలిపారు. మరోవైపు, వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి వ్యక్తిని అబ్జర్వేషన్ లో పెడుతున్నారు. టీకా వేయించుకున్న 30 నిమిషాల తర్వాత వారిని చెక్ చేసి, అంతా బాగుందని నిర్ధారించుకున్న తర్వాతే పంపిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చికిత్స అందించడానికి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.