బాధితులకు అండగా ఉంటా: తనపై ఆరోపణల మీద మరోసారి స్పందించిన మంగ్లీ

Mangli Responds on allegations
  • ఈ కేసుతో తనకు సంబంధం లేదన్న సింగర్ మంగ్లీ
  • వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన
  • బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ
అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన అంశం తెలంగాణను కుదిపేస్తోంది. ఈ ఆర్థిక మోసం కేసులో ప్రముఖ సింగర్ మంగ్లీపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో తనకు సంబంధం లేదని మంగ్లీ పలుమార్లు తెలిపారు. తాజాగా ఆమె మరోసారి స్పందించారు. ఈ కేసులో కావాలనే తన పేరును తెరపైకి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, కొంతమంది తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. బాధితులకు కూడా న్యాయం జరిగే వరకు తాను వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సినిమా పైనాన్సింగ్ సంస్థ పేరుతో నెలకు 3 నుంచి 5 శాతం వడ్డీ ఇస్తామని నమ్మించి 150 మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మంగ్లీ తనకు ఉన్న పాపులారిటీని ఉపయోగించి ఇందులో డబ్బులు పెట్టేలా ప్రోత్సహించారని, ఆమె సోదరుడు శివ కూడా ఇందులో భాగస్వామి అని బాధితుల తరఫు న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో మంగ్లీతో పాటు ఆమె సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Mangli Responds on allegations
Singer Mangli

More Telugu News