కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం
- ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు
- 18 ఏళ్లు, అంతకు పైబడినవారికే వ్యాక్సిన్
- కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల పంపిణీ
- తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటారో రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్
కాగా, ఏపీలో తొలి విడతలో 3.87 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొదటగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. అందుకోసం 332 ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకాల పంపిణీ చేపట్టనున్నారు. ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి దశలో వ్యాక్సిన్లు ఎవరెవరికి ఇవ్వాలన్నదానిపై అధికారులు కొవిన్ యాప్ లో సమాచారాన్ని నిక్షిప్తం చేశారు.