సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

RangDe film release date announced
  • నితిన్ 'రంగ్ దే' రిలీజ్ డేట్ ప్రకటన 
  • యూనిట్ సభ్యులకు ప్రభాస్ కానుకలు
  • వచ్చే నెల 5న వస్తున్న 'ఉప్పెన'  
*  నితిన్, కీర్తి సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' చిత్రాన్ని మార్చ్ 26న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా, నిన్న సంక్రాంతి సందర్భంగా చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
*  తమ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా స్టార్ హీరోలు యూనిట్ సభ్యులకు మంచి గిఫ్టులు ఇస్తుంటారు. అలాగే తాను నటిస్తున్న 'రాధే శ్యామ్' పూర్తయిన సందర్భంగా హీరో ప్రభాస్ సంక్రాంతిని పురస్కరించుకుని యూనిట్ లోని ప్రతి ఒక్కరికీ ఖరీదైన రిస్ట్ వాచీలను కానుకగా పంపించాడట.
*  చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'ఉప్పెన' నుంచి నిన్న రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Nithin
Keerti Suresh
Prabhas
Vaishnav Tej

More Telugu News