Corona Virus: తెలంగాణలో కొత్తగా 474 కరోనా కేసులు

new 474 COVID19 infections in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 474 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 592 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,939 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,78,523 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,538కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,878 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,735 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా  102 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..
 

  
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News