Sensex: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits for fourth straight day
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ వంటి హెవీవెయిట్ కంపెనీలు లాభాలను ఆర్జించడంతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 46,961కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,761 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (2.64%), బజాజ్ ఆటో (2.43%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.42%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.26%), టైటాన్ కంపెనీ (1.25%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.30%), హెచ్డీఎఫ్సీ (-2.09%), ఓఎన్జీసీ (-2.07%), మారుతి సుజుకి (-1.54%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.13%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News