'బ్రోచేవారెవరురా' చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్న అజయ్ దేవగణ్
- వివేక్ ఆత్రేయ రూపొందించిన 'బ్రోచేవారెవరురా'
- తెలుగులో 7 కోట్లలో నిర్మిస్తే 20 కోట్ల వసూలు
- హిందీలో హీరోగా సన్నీ డియోల్ తనయుడు కరణ్
- దేవన్ ముంజల్ దర్శకత్వం.. 'వెల్లీ'గా టైటిల్ ఖరారు
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'బ్రోచేవారెవరురా' క్రైమ్ కామెడీ సినిమా ప్రేక్షకాదరణ పొంది హిట్టయింది. శ్రీవిష్ణు హీరోగా నివేద థామస్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా ఏడు కోట్ల బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 20 కోట్లు వసూలు చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడీ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తీసుకున్నారు.
అజయ్ దేవగణ్ నిర్మాతగా వ్యవహరించే ఈ హిందీ రీమేక్ లో సన్నీ డియోల్ తనయుడు కరణ్ డియోల్, సన్నీ కజిన్ అభయ్ డియోల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. దేవన్ ముంజల్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి హిందీలో 'వెల్లీ' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.