తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌.. 1,500 దాటిన మృతుల సంఖ్య

  • గత 24 గంటల్లో 536 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,135
  • కోలుకున్న వారు 2,70,450 మంది
  • ఇప్పటి వరకు 62,57,745 కరోనా పరీక్షలు
తెలంగాణలో గత 24 గంటల్లో 536 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 622 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,135 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,70,450 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,502కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,183 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,041 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 62,57,745 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Corona Virus
COVID19
Telangana

More Telugu News