రానా 'విరాటపర్వం'లో నివేద పేతురాజ్
- రానా, సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం'
- ప్రత్యేక పాత్ర చేస్తున్న నివేద పేతురాజ్
- హైదరాబాదులో తాజా షెడ్యూలు షూటింగ్
- నక్సలిజం నేపథ్యంలో సాగే సినిమా
వేణు ఉడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో ఈ 'విరాటపర్వం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందే కొంత షూటింగును జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. రానా, సాయిపల్లవితో పాటు ప్రధాన తారాగణం ఈ షూటింగులో పాల్గొంటున్నారు. తాజాగా ప్రత్యేక పాత్రకు ఎంపికైన నివేద కూడా షూటింగులో జాయిన్ అయింది. సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ తో కలసి ఎస్.ఎల్.వి. సినిమాస్ సంస్థ అధినేత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.