రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారు?: అసదుద్దీన్ ఒవైసీ
- ఎంఐఎంకు ఓటేస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందని బీజేపీ అంటోంది
- ఓటర్ల జాబితాలో 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారంటున్నారు
- మరి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారు?
అంతేగాక, ఓటర్ల జాబితాలో 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ ఆరోపణలు చేస్తోందని, 30,000 మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలో ఉంటే మరి దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అమిత్ షా నిద్రపోతున్నారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంత మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారని, అమిత్ షా ఎందుకు విచారణ జరిపించట్లేదని ఆయన అడిగారు. ఆ రోహింగ్యాలు ఎవరో బీజేపీ వెల్లడించాలని అన్నారు. విద్వేషం సృష్టించడమే బీజేపీ నేత ఉద్దేశమని ఆయన అన్నారు.