డ్రగ్స్ కేసులో నటి భారతీ సింగ్ కు బెయిల్!
- సోదాల తరువాత భారతి ఇంట్లో గంజాయి స్వాధీనం
- ఆదివారం అరెస్ట్ అయిన భారతీ సింగ్ దంపతులు
- బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు
నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్న వారిలో భయం మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా పలువురు ప్రముఖులను ఎన్సీబీ విచారించింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన పలువురికి కోర్టులు ఇప్పటికే బెయిల్ ను మంజూరు చేశాయి. డ్రగ్స్ కేసులో సంబంధాలున్నాయన్న అనుమానం వచ్చిన ప్రతి సెలబ్రిటీపైనా నిఘా పెడుతున్న అధికారులు, వారి ఇళ్లలో ఆకస్మిక సోదాలు జరుపుతున్నారు.