తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

spike of 894 new cases in telangana
  • 24 గంటల్లో 894 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,61,728
  • 2,47,790 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,423  
తెలంగాణలో గత 24 గంటల్లో 894 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,057 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,61,728 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,47,790 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,423 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,515 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 10,245 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
Corona Virus
COVID19
Telangana

More Telugu News