భవనంపై నుంచి జారిపడి.. కెనడాలో హైదరాబాద్ యువకుడి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భవనంపై నుంచి జారిపడి.. కెనడాలో హైదరాబాద్ యువకుడి మృతి

Hyderabad student died in toronto
  • టొరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న యువకుడు
  • ఫోన్‌లో మాట్లాడుతూ 27వ అంతస్తు నుంచి జారిపడిన అఖిల్
  • మృతదేహాన్ని తీసుకురావడంలో సాయం అందిస్తామన్న మంత్రి కేటీఆర్
కెనడాలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న హైదరాబాద్ యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వనస్థలిపురం ఫేజ్-4కు చెందిన పాణ్యం అఖిల్ (19) టొరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చి 20న హైదరాబాద్ వచ్చాడు. తిరిగి ఈ నెల 5న కెనడా వెళ్లాడు.

 ఈ నెల 8న తెల్లవారుజామున తానుంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనీలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులు వెంటనే అఖిల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తెప్పించడంలో సాయం చేయాలని కోరుతూ అఖిల్ తల్లిదండ్రులు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి అఖిల్ మృతదేహాన్ని నగరానికి తీసుకు రావడంలో సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడి రాయబార కార్యాలయ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.
Hyderabad
Canada
Toronto
Vanasthalipuram
KTR

More Telugu News