అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- ఇవాళ అద్వానీ పుట్టినరోజు
- పార్టీ కురువృద్ధుడికి శుభాకాంక్షలు వెల్లువ
- అద్వానీపై మోదీ ప్రశంసలు
"నా వంటి కార్యకర్తలకు అద్వానీ గారి మద్దతు, మార్గదర్శనం ఎల్లప్పుడూ అమూల్యమే. జాతి నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం ఎనలేనిది" అని మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా, అద్వానీ నివాసానికి వెళ్లిన మోదీ అక్కడ జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీతో కేక్ కట్ చేయించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.