ఏపీ టీడీపీ చీఫ్ గా నియమించడం పట్ల అచ్చెన్నాయుడి స్పందన
- పార్టీలో భారీగా మార్పులు చేసిన చంద్రబాబు
- అచ్చెన్నకు రాష్ట్ర బాధ్యతలు
- సంతోషం వ్యక్తం చేసిన అచ్చెన్న
ఈ రోజు మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితుడ్నయ్యానని అచ్చెన్న ట్విట్టర్ లో వెల్లడించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తనకు ఈ అవకాశం కల్పించారని వివరించారు. 'మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. మీ కింజరాపు అచ్చెన్నాయుడు' అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.