తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు

spike of 1891new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 
  • మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,208  
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,891 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,878 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,208 కు చేరింది. ప్రస్తుతం 26,374 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 175 కేసులు నమోదయ్యాయి.

  
       
Corona Virus
COVID19
Telangana

More Telugu News