తెలంగాణాలో కొత్తగా 1983 కరోనా కేసులు 
Add ap7am to your home Screen

తెలంగాణాలో కొత్తగా 1983 కరోనా కేసులు

spike of 1983 new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594 
  • మొత్తం 1,74,769 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,181
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 292 కేసులు
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,983 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో పది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,381 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,74,769 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,181కు చేరింది. ప్రస్తుతం 26,644 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 292, రంగారెడ్డి జిల్లాలో 187 కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్నటి వరకు మొత్తం తెలంగాణలో 32,92,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే 50,598 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు.  
        
Corona Virus
COVID19
Telangana

More Telugu News