ప్రారంభంకానున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్.. నటులందరికీ క్వారంటైన్!
- కరోనా కారణంగా ఆగిపోయిన 'ఆర్ఆర్ఆర్' షూటింగ్
- ఈ నెలాఖరున మళ్లీ ప్రారంభం కానున్న షూటింగ్
- 14 రోజుల పాటు నటులకు క్వారంటైన్
ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ లో పాల్గొనే నటులందరూ ఈ నెల 10 నుంచి హోటల్స్ లో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు షూటింగ్ సమయంలో ఉపయోగించే సామగ్రిని శానిటైజ్ చేయించడానికి, థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.