పండగ షాపింగ్ కోసం అప్పు చేస్తున్నారా? జాగ్రత్త.. 60 శాతం మందిపై ఇప్పటికే ఈఎంఐల భారం!
- 40 శాతం మంది పాత అప్పుల కోసం కొత్త రుణాలు
- వైద్య ఖర్చుల కోసం 26 శాతం మంది అప్పులు
- కుటుంబ అవసరాలు, పెళ్లిళ్లు, చదువుల కోసం 22 శాతం రుణాలు
- ఉద్యోగం పోవడం, జీతం తగ్గడంతో 31 శాతం మందికి చెల్లింపుల కష్టాలు
- పండగ రుణానికి ముందు ఆదాయం, వడ్డీ, వాయిదాలు లెక్కించాలని నిపుణుల సూచన
పండగ వచ్చిందంటే కొత్త ఫోన్ కొనాలని, కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలని, బంధుమిత్రులకు బహుమతులు ఇవ్వాలని చాలామంది కోరుకుంటారు. చేతిలో డబ్బులు సరిపోకపోతే క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాల వైపు చూస్తారు. నెలకు కొంత ఈఎంఐ కడితే సరిపోతుందని భావిస్తారు. కానీ ఆ చిన్న వాయిదానే నెలవారీ కుటుంబ బడ్జెట్‌ను తలకిందులు చేయొచ్చు. తాజాగా ఎక్స్‌పర్ట్ ప్యానెల్ అనే రుణ పరిష్కార వేదిక వెల్లడించిన గణాంకాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.
దాదాపు 60 శాతం మంది రుణగ్రహీతల నెలవారీ ఈఎంఐలు వారి కుటుంబ ఆదాయానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయి. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. 40 శాతం మంది ఇప్పటికే ఉన్న ఈఎంఐలు చెల్లించేందుకు కొత్త రుణాలు తీసుకోవడం లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించడం చేస్తున్నారు.
అవసరాల కోసం అప్పులు..
అప్పు తీసుకునే ప్రతి ఒక్కరూ పండగ షాపింగ్ కోసమే రుణాలు తీసుకోవడం లేదు. ఎక్స్‌పర్ట్ ప్యానెల్ గణాంకాల ప్రకారం 26 శాతం లోన్ల వెనుక వైద్య ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కుటుంబ అవసరాలు, పెళ్లిళ్లు, చదువుల కోసం 22 శాతం మంది అప్పులు తీసుకున్నారు. వ్యాపార అవసరాలు, ఉద్యోగం కోల్పోవడం వంటి కారణాలతో 18 శాతం మంది రుణాలు తీసుకోగా.. ఇంటి ఖర్చులు, రోజువారీ అవసరాల కోసం 15 శాతం మంది అప్పులపై ఆధారపడ్డారు.
అయితే ఆదాయం తగ్గినప్పుడు లేదా అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతోంది. రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాల్లో 31 శాతం మందికి ఉద్యోగం పోవడం లేదా జీతం తగ్గడం కారణమైంది. ఆదాయంతో పోలిస్తే ఈఎంఐల భారం ఎక్కువగా ఉండటాన్ని 28 శాతం మంది సమస్యగా పేర్కొన్నారు. ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల 19 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కోగా.. వైద్య, కుటుంబ అత్యవసర పరిస్థితులు మరో 12 శాతం కేసులకు కారణమయ్యాయి.
ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు!
కొత్త రుణం తీసుకునేటప్పుడు నెలవారీ వాయిదా తక్కువగానే కనిపించొచ్చు. కానీ ఇప్పటికే ఉన్న వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఇతర ఈఎంఐలను కలిపి లెక్కిస్తే అసలు భారం తెలుస్తుంది. పాత రుణాల వాయిదాలు చెల్లించడానికి కొత్త రుణాలు తీసుకోవడం ఆర్థిక సమస్యలను మరింత పెంచుతుంది. ఇలా అప్పుల చక్రంలో చిక్కుకుంటే బయటపడటం కష్టమవుతుంది.
పండగల సమయంలో భావోద్వేగాలు, ఇతరుల అంచనాలు, వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవాలనే కోరికతో చాలామంది ఖర్చు చేస్తారని ఎక్స్‌పర్ట్ ప్యానెల్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రా తెలిపారు. ఇప్పటికే ఆదాయంలో ఎక్కువ భాగం ఈఎంఐలకే వెళ్తున్నవారు మరో రుణం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు.
పండగకు లోన్ తీసుకునే ముందు ఇవి చూడండి
కొత్త లోన్ తీసుకోవాలనుకునేవారు ముందుగా తమ ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఇతర అప్పులన్నింటినీ లెక్కించాలి. కొత్త రుణంపై చెల్లించాల్సిన మొత్తం వడ్డీ ఎంత? నెలవారీ వాయిదా చెల్లించిన తర్వాత ఇంటి ఖర్చులకు డబ్బు మిగులుతుందా? అనుకోని వైద్య ఖర్చులు ఎదురైతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి.
అత్యవసరం కాని కొనుగోళ్లను వాయిదా వేయడం మంచిది. డిస్కౌంట్లు, సులభ వాయిదాల పేరుతో అవసరానికి మించి ఖర్చు చేయొద్దు. పండగ సంబరాలు కొద్ది రోజులే ఉన్నా.. వాటి కోసం తీసుకున్న రుణాల చెల్లింపులు నెలల తరబడి కొనసాగుతాయి. అందుకే కొనుగోలు ఇచ్చే ఆనందం కంటే, ఆ తర్వాత ఈఎంఐ భారం ఎక్కువగా ఉంటుందా లేదా అనేది ముందుగానే ఆలోచించాలి.