తెలంగాణలో కొత్తగా మరో 1,718 కరోనా కేసుల నమోదు

spike of 1718 new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327
  • 1,67,846 మంది డిశ్చార్జ్ 
  • 24 గంటల్లో ఎనిమిది మంది మృతి  
  • మృతుల సంఖ్య మొత్తం 1,153  
తెలంగాణ‌లో కరోనా కేసుల తాజా వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,718 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,153 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,153 కు చేరింది. ప్రస్తుతం 28,328 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..  
 
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News