ఆర్ఆర్ఆర్ లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన శ్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్ఆర్ఆర్ లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన శ్రియ

Shriya clarifies about her role in RRR
  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం
  • ఈ చిత్రంలో నటిస్తున్న శ్రియ
  • రాజమౌళికి ఓ విజన్ ఉందన్న శ్రియ
రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో హైప్ నెలకొని ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న అంశమైనా నెట్టింట వైరల్ అవుతోంది. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అలియా భట్ తో పాటు ఓ ఇంగ్లీష్ తార కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా నటిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రియ ఆర్ఆర్ఆర్ చిత్రంలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చింది.

తనది ఇందులో అతిథి పాత్ర మాత్రమేనని స్పష్టం చేశారు. తాను అజయ్ దేవగణ్ పక్కన కనిపిస్తానని వెల్లడించింది. అయినప్పటికీ రాజమౌళితో మరోసారి పనిచేయడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ సరసన శ్రియ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళికి అద్భుతమైన విజన్ ఉందని, ఆర్ఆర్ఆర్ ను ఎంతో విభిన్నంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. రాజమౌళి ప్రత్యేకమైన విజన్ తో ముందుకు వెళుతున్నారని శ్రియ వివరించింది.

సెట్స్ పై ఉన్నంత సేపు ఓ అద్భుతమైన ప్రాజెక్టులో నేను కూడా ఉన్నాననే ఫీలింగ్ కలిగేది అని పేర్కొంది.  కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని శ్రియ చెప్పింది. కాగా, రష్యా క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్ ను పెళ్లాడిన శ్రియ ప్రస్తుతం స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉంటోంది.
Shriya Saran
RRR
Rajamouli
Junior NTR
Ramcharan
Tollywood

More Telugu News