పోలీసుల కస్టడీకి నూతన్ నాయుడు!
- పలువురిని మోసం చేసిన కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
- లోతుగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
- మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
ఆయనను మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విశాఖ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో విచారించడానికి పోలీసులకు జడ్జి అనుమతించారు. మరోవైపు దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడి భార్య మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.