Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 38,901కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 11,470 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ స్టాకుల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (6.38%), బజాజ్ ఫైనాన్స్ (4.42%), ఏసియన్ పెయింట్స్ (3.93%), టాటా స్టీల్ (3.82%), ఎన్టీపీసీ (3.52%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.29%), యాక్సిస్ బ్యాంక్ (-2.23%), టెక్ మహీంద్రా (-1.75%), ఇన్ఫోసిస్ (-1.53%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.99%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News