కోయంబత్తూరు లాడ్జిలో నిలువెత్తు అద్దం... అనుమానంతో పరిశీలించిన పోలీసులు అవాక్కు!

SexRocket Busted in Coimbattore
  • శరణ్యా లాడ్జిలో సెక్స్ రాకెట్
  • అద్దాల వెనుక రహస్య గదులు
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ లాడ్జిలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు, అద్దాల వెనుక ఏర్పాటు చేసిన రహస్య గదుల్లో వ్యభిచారం జరుగుతుండటాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడున్న శరణ్యా లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో పోలీసులు తనిఖీలకు వెళ్లారు. అన్ని గదులను వెతికినా అనుమానించతగ్గ వారు ఎవరూ కనిపించలేదు. ఓ గదిలో మాత్రం వారికి రెండు పెద్ద పెద్ద అద్దాలు కనిపించాయి. ఆ లాడ్జిలో రెండు పెద్ద అద్దాలు ఉండటం, అవి ఎదురెదురుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఓ అద్దాన్ని కదిలించగా దాని వెనుక రహస్యంగా ఏర్పాటు చేసిన ఓ గదే ఉంది. దానిలో బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి ఉంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకుని వచ్చి, దందా జరిపిస్తున్నారని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు
Go Back to Shorts
Coimbattore
Tamilnadu
Sex Rocket

More Telugu News