బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ రెడీ.. కొవిడ్ రోగులకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లు!
- నేడు సమావేశం కానున్న కేంద్ర ఎన్నికల సంఘం
- వచ్చే నెల 20న షెడ్యూల్ విడుదల?
- ర్యాలీలు, బహిరంగ సభలపై ప్రత్యేక మార్గదర్శకాలు
బీహార్ ఎన్నికల నేపథ్యంలో నేడు సమావేశం కానున్న ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహణ, మార్గదర్శకాలపై చర్చించనుంది. అలాగే వచ్చేనెల 20న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ లోపు రాజకీయపార్టీలు, వివిధ ప్రాంతాల చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనుంది. అనంతరం వాటిని క్రోడీకరించి మార్గదర్శకాలను రూపొందించనుంది. బీహార్ ఎన్నికలను రెండుమూడు దశల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.