నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం... తాజా హెల్త్ బులెటిన్ విడుదల

Corona infected SP Balasugrahmanyam health remain stable
  • కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు
  • గురువారం రాత్రి విషమించిన ఆరోగ్యం
  • ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని ప్రత్యేక బులెటిన్ లో తెలిపారు. వైద్యులు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి పట్ల అనుక్షణం గమనిస్తున్నారని ఎంజీఎం వైద్య సేవల విభాగం ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ వెల్లడించారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే, గురువారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ అమర్చారు. అప్పటి నుంచి బాలు ఆరోగ్యంపై అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
Go Back to Shorts
SP Balasubrahmanyam
Corona Virus
ICU
MGM Hospital
Chennai

More Telugu News