Multi System Inflamatory Syndrome: అమెరికా సహా మరో నాలుగు దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సరికొత్త జబ్బు!

MSIC spreading in USA along with other 4 countries
షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. మహమ్మారిని ఎలా నియంత్రించాలో అర్థంకాక అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్, మెడిసిన్ వస్తే కానీ దీన్ని అరికట్టలేమనే భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో జబ్బు ఇప్పుడు భయాందోళనలకు కారణమవుతోంది. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఎస్ఐసీ) అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ ఈ జబ్బును గుర్తించింది.

ఈ కొత్త వ్యాధి లక్షణాల విషయానికి వస్తే... ఇది ప్రధానంగా పిల్లలపైనే ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొలుత జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపించడం మొదలవుతుంది. చర్మంపై దద్దులు, గుండెల్లో మంట వంటివి కనిపిస్తాయి. మరో ప్రధాన అంశం ఏమిటంటే... కరోనా బారిన పడిన పిల్లల్లో ఈ కొత్త వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే అమెరికాలో దాదాపు 600 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్టు సమాచారం. అమెరికాతో పాటు స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి యూరప్ దేశాల్లో కూడా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు. యూఎస్ లో ఇప్పటి వరకు దీని బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Multi System Inflamatory Syndrome
USA
UK
Corona Virus

More Telugu News