ఓ డాక్టర్ చేయందుకోబోతున్న టీమిండియా క్రికెటర్ చాహల్
- ఓ ఇంటివాడు కాబోతున్న లెగ్ స్పిన్నర్ యజువేంద్ర
- రోకా వేడుక పూర్తయిందని వెల్లడి
- ఐపీఎల్ లో ఆడనున్న చాహల్
ఇక చాహల్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు ధనశ్రీ వర్మ. ఆమె ఓ డాక్టర్. అంతేకాదు, అనేక యూట్యూబ్ వీడియోలకు కొరియోగ్రాఫర్ గానూ వ్యవహరించింది. అయితే, కరోనా ప్రభావం కారణంగా ఇన్నాళ్లూ విశ్రాంతి తీసుకున్న చాహల్ త్వరలోనే ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ వెళ్లాల్సి ఉంది. యూఏఈ వేదికగా ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో, పెళ్లి ముహూర్తం ఎప్పుడన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. ఐపీఎల్ పోటీలు నవంబరు 10న ముగియనున్నాయి.