అహ్మదాబాద్ కరోనా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం... 8 మంది సజీవ దహనం!
- నేటి తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్
- ఐసీయూలోని రోగుల దుర్మరణం
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ
మొత్తం 50 పడకల సామర్థ్యమున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది రోగులున్నారు. మిగతా వారిని అందరినీ కాపాడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, మృతుల కుటుంబీకులకు సానుభూతిని తెలిపిన ఆయన, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారు ధైర్యంగా ఉండాలని కోరారు. ఆసుపత్రిలో పరిస్థితిపై సీఎం విజయ్ రూపానీ, నగర మేయర్ లతో మాట్లాడానని, బాధితులకు అన్ని విధాలుగా సాయపడతామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా మృతులకు రూ.2 లక్షల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మంజూరు చేస్తున్నామని, గాయపడిన వారికి, రూ. 50 వేలు ఇస్తామని ఆయన తెలిపారు.