వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజకు హాజరుకానున్న అద్వానీ, జోషి!
- ఆగస్టు 5న అయోధ్యలో భూమి పూజ
- శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని
- అద్వానీ, జోషిలను ఫోన్ ద్వారా ఆహ్వానించిన ట్రస్టు
అయితే నాడు రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడంలేదు. వీరిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజలో పాల్గొంటారని తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అద్వానీ, జోషిలకు ఈ మేరకు ఆహ్వానం పంపింది. ఫోన్ ద్వారా భూమి పూజ సమాచారం అందించింది.