ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాసిన వర్ల

  • రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందన్న వర్ల
  • వరప్రసాద్ ఘటనే నిదర్శనమంటూ వివరణ
  • బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలు, మహిళలు, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఏపీలో గత కొంతకాలంగా అనాగరిక పాలన నడుస్తోందని, ముఖ్యంగా ఎస్సీలపై దాడులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు వరప్రసాద్ పై జరిగిన దాడే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Varla Ramaiah
NHRC
Andhra Pradesh
YSRCP
SC
BC
Telugudesam

More Telugu News