Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 499 points high
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 499 పాయింట్లు లాభపడి 35,414కు పెరిగింది. నిఫ్టీ 128 పాయింట్లు పుంజుకుని 10,430 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (6.58%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (4.59%), బజాజ్ ఫైనాన్స్ (4.43%), ఐటీసీ (4.16%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.73%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.40%), నెస్లే ఇండియా (-2.23%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.18%), ఎల్ అండ్ టీ (-2.10%), ఓఎన్జీసీ (-1.11%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News